వీలైనంత వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. తాజా పండ్లు కూరగాయాలు తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను మెనులో చేర్చుకోవాలి. అధికంగా పిండి పదార్థాలు ఉండే డొనట్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిని తగ్గించుకోవాలి. తక్కువ మోతాదులో మాంసాహారం, తక్కువ కొవ్వు ఉన్న పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. రోజూ వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య దూరమవుతుంది. వైద్యుల సూచన లేకుండా ఉపయోగించే మందులతో కాలేయం పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.