టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం తన బిడ్డ అని, ఎలాగైనా పూర్తిచేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి ఫైరయ్యారు. 'పోలవరం నీ బిడ్డనా? 72 ఏళ్లు వచ్చాయి సిగ్గు, లజ్జా ఉండాలి. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్ గారు ప్రారంభించి, అన్ని అనుమతుల తీసుకొచ్చారు. ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడటం చంద్రబాబుకు బాగా అలవాటు. ఒకప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కున్నాడు. ఇప్పుడు పోలవరాన్ని తన బిడ్డ అంటున్నాడు' అని మంత్రి సెటైర్ వేశారు.