వైఎస్సార్ కడప జిల్లాలో నేటి నుండి రెండు రోజులపాటు ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు పార్నపల్లి సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ జెట్టీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ వద్ద రెస్టారెంట్ ను ప్రారంభించి, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. రేపు పులివెందులలో భాకారపురం చేరుకొని, ముఖ్యమంత్రి పీఏ రవిశేఖర్ కుమార్తె వివాహవేడుకలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.