హరియాణాలో దారుణం జరిగింది. గురుగ్రామ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇల్లు కొనేందుకు భీష్మ్, షంషేర్, అజయ్ అనే ముగ్గురు వ్యక్తుల దగ్గరకు వెళ్లింది. తొలుత ఆమెను ఓ సొసైటీకి తీసుకెళ్లారు. తిరుగుపయనంలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.