ఇందుకూరుపేట మండలంలోని, స్థానిక సిడిపిఓ కార్యాలయంలో గురువారం అంగన్వాడి కార్యకర్తలతో జిల్లా శిశు సంక్షేమ సాధికారత అధికారిని సౌజన్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా చట్టాల పై అవగాహన, దిశ యాప్ తదితర విషయాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేనా సుజన్, అంగన్వాడి కార్యకర్తలు, పొదుపు మహిళలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.