జిల్లాలో జనాభాకు తగ్గట్టుగా యువత ఓటర్లుగా నమోదు చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ బాబు కెవిఎన్ చక్రధర్ బాబు కేంద్ర రాష్ట్ర ఎన్నికల ఉన్నతాధికారులకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుండి కేంద్ర సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ ఎస్ హెచ్ నితేష్ వ్యాస్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు.