పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత ఇంటి వద్ద శుక్రవారం అర్థరాత్రి బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో టీఎంసీ నాయకుడు రాజ్‌కుమార్ మన్నా, మరో ఇద్దరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం ఆ ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలో బాంబు పేలుడు సంభవించడం కలకలం రేపింది. టీఎంసీ నేతలు రాజ్‌కుమార్ మన్నా ఇంట్లో భేటీ అయిన సమయంలో దుండగులు బాంబు పేల్చినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.