ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ను మరో అవార్డు వరించింది. అమెరికాలోని మెంఫిన్ జాతీయ పౌర హక్కుల మ్యూజియం ఆయనకు ‘ది ఎమిసరీ ఆప్ పీస్ (శాంతిదూత)’ అవార్డును అందజేసింది. మానవతావాదిగా, శాంతి రాయబారిగా, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, జాతుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని మ్యూజియం బోర్డు డైరెక్టర్ శైలా కర్కేరా చెప్పారు.