స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికొడ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా.. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 197 మంది ప్రయాణీకులు ఉన్నారు. హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో పైలెట్ సమచారం అందించగా కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.