రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే యాత్రను కొనసాగించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో వైపు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు నేటి సాయంత్రం ఆ పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఇంతకు ముందు ఖర్గే ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడంతో మరొకరి నియామకం జరగలేదు.