బీహార్ లో కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. వైశాలి జిల్లాలోని మెహ్నర్ లో జరిగిన విందుకు ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం సేవించి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇదే తరహాలో వివాహ వేడుకలో పాల్గొన్న మరో ఇద్దరు కూడా చనిపోయారు. ఈ మరణాలపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.