అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్‌కు షాక్ తగిలింది. ఆయన తన వయసు గురించి తప్పుడు వివరాలు అందించాడని ఫిర్యాదు వచ్చింది. దీంతో కర్ణాటక పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. లక్ష్య సేన్ 1998లో జన్మించగా, 2001ని తన పుట్టిన సంవత్సరాన్ని మార్చేశాడని నాగరాజా ఎంజీ అనే వ్యక్తి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనన ధ్రువపత్రాలను తారుమారు చేసి, ఇతర ప్రతిభావంతులైన ఆటగాళ్లను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభుత్వం నుండి లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందారని ఆరోపించాడు.