మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి శుక్రవారం వినూత్న స్వాగతం లభించింది. తనోదియా పట్టణంలో ఆయన తేనీటి విరామ సమయం తీసుకుంటున్న సమయంలో 2 లాబ్రడార్ జాతి శునకాలు ఎదురొచ్చి పూలబుట్టను అందజేసి సాదర స్వాగతం పలికాయి. లిజో, రెగ్జీ అనే ఈ శునకాలకు ఇండోర్ కు చెందిన సర్వమిత్ర యజమాని. రాహుల్ పాదయాత్రలో తన ప్రత్యేకత చాటుకునేందుకు వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చనట్లు తెలిపారు.