పీఓకే పై పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోవలన్న భారత్ కల ఎప్పటికీ కల గానే మిగిలిపోతుందని పేర్కొన్నాడు. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన శనివారం పీవోకేలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ భూభాగంలో ఒక్క ఇంచు జాగాను కూడా వదులుకోబోమని, మాతృభూమిని కాపాడుకోవడానికి పాక్ సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని అన్నారు. శత్రువుకు ధీటుగా జవాబు చెబుతారని మునీర్ పేర్కొన్నారు.