కోడలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చారు ఆమె కుటుంబసభ్యులు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన జిల్లాలో చోటుచేసుకుంది. 'పెళ్లయి ఐదేళ్లు అయినా నీకు సంతానం లేదు, నేను నిన్ను గర్భవతిని చేస్తానంటూ' తమ్మేగౌడ తన కోడలిని వేధించేవాడు. కుదిరినప్పుడల్లా ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట. దీంతో తట్టుకోలేక పోయిన సదరు మహిళ, ఈ విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పింది. దీంతో వారు తమ్మేగౌడని ఇంటికి పిలిచి మద్యం, మాంసంతో విందు ఇచ్చారు. అనంతరం కిరాయి మనుషులతో అతనిపై దాడి చేసి చంపించారు. మృతదేహాన్ని ఊరవతల పడేశారు. కాగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.