ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యామ్నాయ పంటలను పండించాలి: మంత్రి కాకాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 11:15 AM

రైతులందరూ వరి పండిస్తే కొనడం కష్టమని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీజన్‌కు తగ్గట్టుగా సాగునీరు సరఫరా చేస్తుండడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారని, ఈ ఆలోచన నుండి బయటకు రావాలని మంత్రి అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి, మొక్కజొన్న వంగడాలను దేశంలోని 75 శాతం మంది రైతులు వినియోగిస్తున్నారని, దీనికి కారకులైన శాస్త్రవేత్తలను మంత్రి అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com