ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఓటేసేందుకు డల్లుపుర పోలింగ్ బూత్ కు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరికి వింత అనుభవం ఎదురైంది. ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదని సిబ్బంది చెప్పడంతో షాకయ్యారు. కాగా, డిలీటెడ్ లిస్ట్ లోనూ పేరు కనిపించలేదు. ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడి ఓటు కూడా గల్లంతవడం చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారని అనిల్ చౌదరి చెప్పారు. అయితే, ఆయన భార్య మాత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు.