బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా తప్పుకున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత రిషబ్ పంత్ ను వన్డే జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ తెలిపింది. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ముందు అతను మళ్లీ జట్టులో చేరనున్నాడని, అతని ప్లేస్ లో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని బీసీసీఐ తెలిపింది. మరోవైపు తొలి వన్డే ఎంపికకు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. ఈ సిరీస్ లో పంత్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.