ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఉసిరికాయను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఉసిరికాయను ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాలేయ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉసిరి ఉపశమనాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది. మధుమేహంతో బాధపడేవారిలో గ్లూకోజ్ మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది.