ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి పాత్రపై విచారణ జరగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 11:43 AM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం లో బాబు, లోకేష్ పాత్ర ఉంద‌ని గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అది ఒక భారీ స్కాం. సుమారు రూ. 241 కోట్లు దారిమళ్ళిందని ఈడీ నోటీసులు ఇచ్చింద‌న్నారు. దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ల పాత్ర తప్పకుండా ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు  తెలియకుండా ఇంత పెద్ద స్కాం జరగే అవకాశమే లేదు. మాకు నోటీసులు రాలేదని సంబరపడొద్దు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని మేం కూడా కోరుకుంటున్నామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com