కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ యాత్రకి పలుచోట్ల ప్రజలనుండి మంచి మద్దతు వస్తుంది. అయితే రాహుల్ చేస్తున్న భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ మరో పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం. మహిళా మార్చ్ పేరుతో ప్రియాంక ఈ యాత్రను జనవరి 26 నుండి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మహిళా మార్చ్ పలు రాష్ట్రాల్లోని రాజధానుల్లో రెండు నెలల పాటు కొనసాగనుందని ఆయన తెలిపారు.