దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. మణిగండం వద్ద ఆశాపురా రంపపు మిల్లు వద్ద శనివారం ఉదయం మిల్లు కార్మికులు ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ వ్యక్తి మిల్లులోకి చొరబడి, దొంగతనం చేశాడని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చే లోపే ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిని తువ్వకుడికి చెందిన చక్రవర్తిగా గుర్తించారు. అతడి శరీర భాగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.