నేడు గుజరాత్ రెండో దశ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేయనున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామేశ్వర దేవాలయం సమీపంలోని మున్సిపల్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శిలాజ్ ప్రైమరీ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.