ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలకు వైసీపీ జెండా రంగులు వేసి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ చెట్లకు సైతం ఆ రంగులు వేయడం చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని జీఎన్ టీ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను నరికి వాటికి వైసీపీ జెండా తరహాలో రంగులు వేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ను ఈ విషయంపై అడగగా 'చెట్లు ఏపుగా పెరగడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని తొలగించాం. గుర్తు తెలియని వ్యక్తులు వాటికి రంగులు వేశారు' అని వెల్లడించారు.