చిన్నారుల్లో లాంగ్ కోవిడ్ లక్షణాలు ఎప్పటికప్పుడు మారే అవకాశముందని ఓ అధ్యయనం తేల్చింది. 11 నుంచి 17 ఏళ్ల మధ్యలో 5,086 మంది చిన్నారులపై ఈ పరిశోధన సాగింది. వారంతా 2020 సెప్టెంబరు నుంచి గత ఏడాది మార్చి వరకు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 2909 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా, 2177 మందికి నెగటివ్‌గా తేలింది. పాజిటివ్ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరు నెలలు, ఏడాది తర్వాత ఆరా తీశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట సహా 21 రకాల గురించి వారిని ప్రశ్నించారు.