అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సంఖ్య దాదాపు 20 వేల వరకు ఉండవచ్చని తాజాగా తెలుస్తోంది. రానున్న నెలల్లో అమెజాన్ పలు ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల కార్మికులు, టెక్నాలజీ ఉద్యోగులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సహా దాదాపు 20 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ‘కంప్యూటర్ వరల్డ్’ వెబ్సైట్ పేర్కొన్నది.