గుజరాత్‌లోని దంతాలో హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీపై బీజేపీ నేతలు కత్తులతో దాడి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కాంతి ఖరాడీ లూథా సొంత ప్రాంతంలో పర్యటిస్తుండగా, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కారుపైకి దూసుకొచ్చి దాడి చేయబోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే కాంతి ఖరాడీ తన కారును వెనక్కి తిప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు. బీజేపీ నాయకులు కత్తులతో తన కారును వెంబడించారని, తాను సమీపంలో అడవిలోకి పరుగు తీయాల్సివచ్చిందని ఆయన తెలిపారు. సుమారు 15 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టాల్సి వచ్చిందని వాపోయారు.