ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడిలో చైనా పాత్ర ఉన్నట్లు బయటకు వచ్చింది. హాంకాంగ్‌లోని రెండు ఈ మెయిల్ ఐడీల నుంచి ఈ సైబర్ దాడి జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ రెండు మెయిల్స్‌కు సంబంధించి ఐపీ అడ్రస్‌లను గుర్తించగా.. ఇందులో చైనా పాత్ర తెరపైకి వచ్చింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్వో) దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు ఇందు కోసం గుజరాత్ సైన్స్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటున్నారు.