భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శిఖరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం ఆయన పరితపించారు. 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో జన్మించారు. ఆయన కడు పేదరికంలో పెరిగారు. బరోడా రాజు సాయంతో విద్యనభ్యసించారు. ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్‌ది కీలకపాత్ర. జీవితం చివరి దశలో ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు. డిసెంబర్ 6న మరణించారు. అంబేద్కర్ సేవలకు గాను భారత రత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.