అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా రామచంద్ర, తిప్పనాయక్ కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పేదింట్లో వెలిగిన దీపంలా, భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థిక వేత్తగా, న్యాయ శాస్త్రవేత్తగా ఎదిగిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన వ్యక్తి అన్నారు.