భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్, తన ఎదురింట్లో ఉండే కౌసల్య(23) రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. అయితే భార్యపై అనుమానంతో రంజిత్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. రంజిత్ పేరెంట్స్ కూడా వరకట్నం కోసం కౌసల్యను వేధించేవారు. ఆదివారం మధ్యాహ్నం కౌసల్యతో రంజిత్ గొడవపడ్డాడు. తాళి దారంతోనే గొంతు బిగించి ఆమెను హత్య చేశాడు. అనంతరం తన కొడుకును తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి రంజిత్ కోసం గాలిస్తున్నారు.