ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరిని వాడుతూ ఉంటారు. ఉసిరిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఉసిరిని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. ఉసిరిని డైట్‌లో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరి వల్ల లివర్ సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ గ్లూకోస్ మెటాబలిజంని ఉసిరి పెంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళకి కూడా గ్లూకోస్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.