బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు సాయంత్రం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు (డిసెంబర్ 7) సాయంత్రం నాటికి తుఫానుగా మారనుంది. అయితే ఇది వాయుగుండంగా మారే సమయానికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఇది డిసెంబర్ 8 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రపై ప్రభావం చూపుతుంది. ఈ తుపాను ప్రభావం తమిళనాడు, కోస్తాంధ్రపై 48 గంటల పాటు ఉంటుందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa