నరసరావుపేట పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స చేయించుకున్న దాదాపు 32 మందికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం పంపిణీ చేశారు. ఎంపీ మాట్లాడుతూ 32 మందికి 30 లక్షల రూపాయల సీఎం సహాయనిది చెక్కులను అందజేస్తామని అన్నారు.