మర్రిపాలెం విషాధ సంఘటన చోటుచేసుకుంది. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై యువకుడి మృతదేహాన్ని బుధవారం రైల్వే పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఆమేరకు కేసు నమోదు చేశారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న పవన్ గా గుర్తించారు. దాకమర్రి వద్ద కళాశాలలో 3వ సెమిస్టర్ పరీక్షకు మంగళవారం కళాశాలకు బయలుదేరి వెళ్లిన పవన్ మర్రిపాలెం ప్రాంతానికి చెందినవాడు. కళాశాలకు బయలుదేరి వెళ్లిన పవన్ అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. అయితే ఇది హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని కోరుతున్నారు.