దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ కార్లని వెనక్కి పిలిపిస్తుంది. 9,125 కార్లను కంపెనీ రీకాల్ చేస్తుంది. ముందు వరుసలోని సీట్ బెల్టుల్లో లోపాలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ విడిపోతుండడంతో కంపెనీ తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆ లోపాన్ని సవరించేందుకు కార్ల రీకాల్ ప్రకటించారు. 2022 నవంబరు 2వ తేదీ నుంచి నవంబరు 28వ తేదీ మధ్య తయారైన గ్రాండ్ విటారా, బ్రెజా, సియాజ్, ఎక్స్ఎల్-6, ఎర్టిగా మోడళ్ల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు మారుతి సుజుకి వెల్లడించింది.