ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెన్షన్ దారులకు కూడా ఆలస్యంగా చెల్లింపులు జరగనున్నాయి. ఈ నెల 15 వరకు అందరికీ జీతాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, రాష్ట్రానికి వచ్చే రాబడి, అప్పులపై ఆంక్షలు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రాబడి, చెల్లింపులకు మధ్య భారీగా తేడా ఉండడంతో జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు కేంద్రం నుండి రావల్సిన జీఎస్టీ నిధులు వెనక్కి వెళ్లడంతో మరింత ఇబ్బంది ఏర్పడింది.