దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారింది. నేడు సాయంత్రానికి మాండూస్ తుఫానుగా బలపడనుంది. దీంతో 8,9,10 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యాకారులు ఈ నెల 10 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.