విశాఖపట్నంలోని మధురవాడలో డ్రమ్ములో మహిళ మృతదేహం బయటపడిన కేసులో మిస్టరీ వీడింది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24) గా గుర్తించారు. నిందితుడిని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన రిషివర్ధన్ గా గుర్తించారు. వికలాంగుల కాలనీలో రిషి వర్ధన్ 2020లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన భార్య గర్భవతి కావడంతో 2021 జనవరిలో ఆమెను పుట్టింటికి పంపించాడు.
2021 మే 29న అతనికి ధనలక్ష్మి పరిచయమైంది. అదే నెల 30న ఆమెను ఇంటికి రప్పించాడు. ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే గొడవ చేస్తానని హెచ్చరించింది. దీంతో రిషి ఆమెను చున్నీతో మెడ బిగించి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం ఆ ఇంటి యజమాని ఇంటి లోపలికి వెళ్లి చూడగా, డ్రమ్ములో మహిళ అస్తిపంజరం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంట్లో ధనలక్ష్మి బ్యాగ్ కనిపించడం, అందులో రిషి ఫోన్ నెంబర్ రాసిన స్లిప్ దొరకడంతో పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.