పెళ్లయిన ఆర్నేళ్లకే ఓ వివాహత అనుమానాస్పద స్థిలో మృతి చెందింది. భర్త వివాహేతర సంబంధమే ఆమె ప్రాణం తీసింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలుకా హందిగద్దెలో జరిగిందీ ఘటన. యమునకు విఘ్నేశ్వర గౌడతో 7 నెలల క్రితమే పెళ్లయింది. అయితే భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఉన్నట్టుండి మంగళవారం యమున ఉరేసుకుని చనిపోయింది. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యమున తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.