భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రోహిత్ శర్మ బొటన వేలికి దెబ్బ తగిలింది. బొటన వేలికి బాల్ బలంగా తాకడంతో రోహిత్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి పంపింది.