కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. తాజాగా కర్ణాటకకు బస్సులు నిలిపివేస్తూ మహారాష్ట్ర ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో జరుగుతున్న గొడవల్లో మహారాష్ట్ర బస్సులపై దాడి జరగవచ్చని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు, బస్సుల క్షేమంపై పోలీసుల నుండి క్లియరెన్స్ వచ్చాక కర్ణాటకకు బస్సులు పునఃప్రారంభిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.