ఉత్తరప్రదేశ్ హర్దోయ్ లోని అహిరోరి బ్లాక్ గ్రామాల్లో ఈగలు చేస్తున్న విధ్వంసానికి అక్కడ పురుషులకు పెళ్లిళ్లవడం లేదు. పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఇక పెళ్లయిన వారైతే విడాకులు తీసుకుంటున్నారు. అరిహోలి బ్లాక్ పరిధిలో 2014లో ఒక పౌల్ట్రీ ఫారంను ఏర్పాటు చేశారు. దాని దాటికి ఈగల సంఖ్య గణనీయంగా పెరిగింది. అవి నానా ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో పురుషులకు పెళ్లిళ్లవడం లేదు.