రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను ‘ద్రోహి’ అని వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్పందించారు. ‘’ రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ నేను మనిషినే. కొన్ని మాటలు నన్ను బాధిస్తాయి. గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్రంగా బాధించాయి. నేను గతంలోకి వెళ్లను. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ ముందుకు సాగిపోతా.” అని సచిన్ పైలట్ అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెహ్లాట్‌తో ఉన్న విబేధాల గురించి తన అభిప్రాయం వెల్లడించారు.