నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ పార్లమెంట్ సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్లో చర్చలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. మన దేశంపై అంతర్జాతీయంగా అంచనాలు పెరుగుతున్నాయని, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రయత్నాలు జరగాలని మోదీ తెలిపారు.