అద్దంకి పట్టణంలో గత నెలలో జరిగిన బత్తుల పెద్దిరాజు ప్రశాంతివి ఆత్మహత్యలు కాదని పరువు హత్యలేనని అనుమానం కలుగుతుందని దళిత పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర అన్నారు. సందర్భంగా ఆయన మెదరమెట్లలో బుధవారం నాడు లోకల్ యాప్ తో మాట్లాడుతూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానం కలుగుతుందని అన్నారు. ప్రేమికుల మృతికి సంబంధించి త్వరగా ఫోరెన్సిక్ పోస్టుమార్టం రిపోర్ట్ తెప్పించాలని నాగేంద్ర డిమాండ్ చేశారు. కేసు విచారణ అధికారిని మార్చాలని ఆయన కోరారు.