జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక జామపండులో నారింజ కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటిక్ రోగులకు మంచిది. అలాగే, జామ శరీరంలో సోడియం మరియు పొటాషియం స్థాయిలను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జామపండులోని మెగ్నీషియం కండరాలు మరియు నరాలను శాంతపరుస్తుంది.