ప్రస్తుత కాలుష్య జీవనంలో ప్రతిఒక్కరూ చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పలు చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. నిమ్మరసంలో కొబ్బరి నూనె కలిపి తలకు బాగా పట్టించి, దాదాపు రెండు గంటల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఆలివ్ నూనెను జుట్టుకు బాగా పట్టించి మర్దనా చేయాలి. ఒక అరగంట ఆగి శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.