ప్రస్తుత కాలంలో చాలా మంది మైగ్రేన్, తలనొప్పి సమస్యలతో సతమతమవుతున్నారు. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా మైగ్రేన్ కు దారి తీస్తాయి. ఊరగాయలు ఇంకా చీజ్ వంటి ఆహారాలలో టైరమైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మైగ్రేన్ సమస్యలు అనేవి చాలా ఎక్కువవుతాయి. అలాగే టీ ఇంకా కాఫీల్లో పెద్ద మొత్తంలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తలనొప్పితో పాటు అలసట, మానసిక ఆందోళన వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే తక్కువ క్యాలరీలున్న ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. దీని కారణంగా, రక్తపోటు కూడా నియంత్రణలో ఉండదు.