ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ చేపట్టకుండా డేవిడ్ వార్నర్ పై జీవితకాల నిషేదం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు వార్నర్ దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా ఈ దరఖాస్తును విరమించుకున్నట్లు వార్నర్ ప్రకటించాడు. ఇటీవల కౌన్సిల్ న్యాయవాది తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని, 2018 పర్యటనలో ఏం జరిగిందో వారు బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారని వార్నర్ ఆరోపించాడు. ఆ సంఘటనపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని ప్యానెల్ నిర్ణయించిందని, దీనివల్ల తన కుటుంబం మరింత ఇబ్బంది పడుతుందని, ఆ చెత్త ఎపిసోడ్ ను క్లీన్ చేసేందుకు తాను సిద్ధంగా లేనని వార్నర్ తెలిపాడు.